Marco

Marco

Actors: Unni Mukundan, Ishaan Shaulat, Abhimanyu S Thilakan, Yukti Tareja, Kabir Duhan Singh, Siddique and others Director: Hanif Adeni Producer: Sharif Mohammed Music: Ravi Basroor Cinematography: Chandru SelvarajCourse: Shamir Mohammed Related links: Trailer Released in theaters at the beginning of this new year. One of the latest movies is Malayalam crazy hit movie “Marco”. Let’s see in the review whether this film released in Telugu from January 1 with good hype will please the Telugu audience. Story: If we come to the story.. Russell (Abhimanyu S Thalikan) kills a blind boy named Victor (Ishaan Shaukat) in the most brutal way. On the other hand, Marco (Unni Mukundan), who is very fond of Victor, who will go to any lengths for his family, what decision did he take in the case of Victor’s tragic death? But why did Russell have to kill this boy named Victor? What is the link between Russell and the gang and Marco’s brother’s gang? You have to watch this movie to know the extent to which Marco took his revenge. Plus points: This movie became a sensational hit in Malayalam. Moreover, this movie which is getting good collections in Hindi too, has been compared by many people with the Hindi violent movie “Kill”. But it can be said that there is no mistake in their comparison. Not that it is in that range, but solid violent elements are terrifying in this movie too. Especially some scenes seem very brutal. Some of the sequences are also stylishly designed and provide a good feast for the action movie lovers. Also in the movie interval block as well as a brutal episode with the pre-climax villain and the climax portion also give a good treat.

ఇక సినిమాలో హీరో ఉన్ని ముకుందన్ సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచారు అని చెప్పాలి. ఇది వరకు తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి సినిమాల్లో చూసాం కానీ ఈ సినిమాలో మాత్రం తాను పూర్తిగా వేరే అని చెప్పాలి. తనలోని బీస్ట్ మోడ్ ని ప్రదర్శించి యాక్షన్ మూవీ లవర్స్ కి ట్రీట్ ఇస్తాడు. తన పర్సనాలిటీ లుక్స్, పలు ఎమోషనల్ సీన్స్ ని బాగా చేసాడు. ఇక యాక్షన్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టాడని చెప్పాలి.

ఇంకా తనతో పాటుగా విలన్ రోల్ లో కనిపించిన నటుడు అభిమన్యు థాలికన్ తన పాత్రలో క్రూరత్వాన్ని చూపించారు అలాగే మరో ప్రముఖ నటుడు కబీర్ దుహన్ సింగ్ ప్రీ క్లైమాక్స్ లో విలనిజం ప్రదర్శించి మంచి యాక్షన్ సీన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. అలాగే ఇంకో సీనియర్ నటుడు సిద్దికీ కి కూడా మంచి రోల్ వచ్చింది. ఇలా నటినటులు అంతా తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా చేసేసారు.

మైనస్ పాయింట్లు:

ఈ సినిమాని ఒక క్రేజీ వైలెంట్ డ్రామాగా ప్రొజెక్ట్ చేశారు కానీ ఈ సినిమాపై ఆ రేంజ్ అంచనాలు పెట్టుకొని వెళ్లినవారికి ఒకింత నిరాశ తప్పదు. హీరో ఎంట్రీతో పాటు ఫస్టాఫ్ లో ఒకటీ రెండు సీన్స్ తప్ప మిగిలిన కథనం అంతా ఒకింత రొటీన్ గా స్లోగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే కిల్ తో కూడా చాలా మంది పోల్చారు కానీ దానికి కేవలం ఎంత క్రూరత్వం చూపించారు అంటే దానిలో చూసుకున్నా కూడా కిల్ ఒక మెట్టు పైన ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

ఎందుకంటే మార్కోలో కూడా కిరాతకంగా చంపుకునే ఎపిసోడ్స్ ఉన్నాయి కానీ వాటిలో అంత సహజత్వం అనిపించదు. చాలా వైలెన్స్ సీన్స్ లో ఆ నాచురాలిటీ మిస్ అయ్యింది కానీ కిల్ లో అలా ఉండదు. ప్రతీ సీన్ అంత కలర్ టోన్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ డార్క్ థీమ్ లో సినిమాని చూపించడానికి అంత నాచురల్ గా కనిపించదు.

ఇంకా చెప్పాలంటే మార్కో లో కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఏదో వీడియో గేమ్స్ లో గ్రాఫిక్స్ ని తలపిస్తాయి. సో నాచురాలిటీతో కూడిన ఒక క్రేజీ యాక్షన్ అండ్ వైలెన్స్ సినిమాని కోరుకునేవారికి ఈ చిత్రం పూర్తి స్థాయిలో ట్రీట్ ఇవ్వలేదు. ఇక ఇవి కాకుండా ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి సడెన్ గా బలహీనం అయ్యిపోయిన హీరో పాత్ర మళ్ళీ వెంటనే బలపడిపోవడం ఆ పరిస్థితులు అంత సింక్ అయ్యినట్టుగా కనిపించవు. ఇలా కొన్ని లాజికల్ ఎర్రర్స్ కూడా లేకపోలేవు. ఇంకా ఇది ఏ రేటెడ్ సినిమానే అయినా ప్రీ క్లైమాక్స్ లో ఓ ఎపిసోడ్

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ పరంగా మేకర్స్ మంచి ఖర్చు చేసారని చెప్పొచ్చు. అలాగే టెక్నీకల్ టీం లో రవి బాసరి స్కోర్ కొన్ని సీన్స్ లో ఇంపాక్ట్ చూపిస్తుంది. మంచి స్టైలిష్ బీట్స్ ని తాను అందించారు కాకపోతే ఇంకా పలు సీన్స్ లో బాగా ఇచ్చుంటే బాగుండేది. చంద్రు సినిమాటోగ్రఫీ బాగుంది. షమీర్ ముహమ్మద్ స్కోర్ ఎడిటింగ్ ఓకే. యాక్షన్ పార్ట్ డిజైన్ బాగుంది కానీ వాటిలో సహజత్వం లోపించింది.

ఇక దర్శకుడు హనీఫ్ అదేని విషయానికి వస్తే.. తాను రొటీన్ రివెంజ్ ప్లాట్‌నే ఎంచుకోవచ్చు కానీ దానికి ఒక భయంకరమైన రక్తపాతాన్ని జోడించారు. హింసలో పీక్ ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు తాను చూపించారు. కానీ కథనం మాత్రం సోసోగానే అనిపిస్తుంది. కాబట్టి కేవలం యాక్షన్ పార్ట్, వైలెన్స్ పార్ట్ వరకు తన వర్క్ సాలిడ్ గా వర్కౌట్ అయ్యింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మార్కో” బ్రూటల్ గా సాగే రొటీన్ రివెంజ్ తో కూడిన వైలెన్స్ డ్రామా అని చెప్పొచ్చు. ఉన్ని ముకుందన్ ప్రాణం పెట్టేస్తే.. మంచి యాక్షన్, ఇలాంటి బ్లడ్ యాక్షన్ డ్రామాలని ఇష్టపడేవారికి మాత్రం ఈ చిత్రం నచ్చవచ్చు. కానీ కథ, కథనాలలో కూడా దర్శకుడు ఇంకా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే సెట్ చేసాడు అయితే ఈ బ్లడ్ అండ్ యాక్షన్ డ్రామా ఇంకా గట్టిగా పేలింది. కాబట్టి వీటితో డెఫినెట్ గా ఓసారికి ఈ యాక్షన్ లవర్స్ ట్రై చేయవచ్చు.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *